సాక్షి డిజిటల్ న్యూస్,14 మార్చి 2026, రామన్నపేట మండలం రిపోర్టర్,శ్యామల నాగరాజు వంశరాజ్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో విద్యుత్ లోవోల్టేజీ హెచ్చుతగ్గులతో ఇబ్బంది పడుతున్నామని జనం, రైతులు ఆరోపిస్తున్నారు.గృహంలో వాడేటటువంటి టీవీ, ఫ్యాన్, వ్యవసాయ బావి మోటర్లు మొదలైన ఎలక్ట్రిక్ పరికరాలు తరచూ కాలిపోతున్నాయని 15 రోజుల క్రితం ఏఈ కోటేశ్వరరావు రామన్నపేట సెక్షన్ అధికారికి మరియు సిబ్బంది లైన్మెన్ దృష్టికి తీసుకుపోయిన సమస్యలు పరిష్కరించ లేకపోతున్నారు. ఇప్పటికైనా పై ఉన్నత అధికారులు తక్షణమే స్పందిస్తూ ఈ విషయాన్ని పరిష్కరిస్తూ పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
