సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 15, 2026. రిపోర్టర్ కిన్నెర వేణు కమలాపూర్ మండలం హనుమకొండ జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాతకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక, 99రోజులు కార్యక్రమం లో భాగంగా ఈ రోజు ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన స్పెషలిస్ట్ వై ద్య శిబిరం ను ఉప్పల్ సర్పంచ్ -రమ నాగరాజు, ఉప సర్పంచ్ డి ఏం హెచ్ ఓ కలిసి ప్రారంభించార డి ఎం హెచ్ ఓ మాట్లాడుతూ, స్పెషలస్ట్ క్యాంప్స్, ప్రభుత్వం నిర్ణయం మేరకు, కలెక్టర్ఆదేశాల తో జిల్లాలో ఇప్పటి వరకు 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 6/3/26నుండి నిర్వహించడం జరిగింది,1597 మందిన ఎంజీఎం హాస్పిటల్ నుండి వచ్చిన 6 గురు స్పెషలిస్ట్ లు పరీక్షించారు ,వీరిలో నుండ ఎంజీఎం జి ఎం హెచ్ కు 132 మందిని తదుపరి వైద్యం కొరకు పంపడం జరిగింది. కావున ఈ రోజు ఈ ఉప్పల్ పీహెచ్సీ పరిధిలో గల ప్రజలు వైద్య సేవలను వినియోగించు కోవాలని కోరారు సర్పంచ్, రమ నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చాలా మంచిది అని, ప్రజలు ఎవ్వరు ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా, ఉండాలని, ఒకవేళ వ్యాధులు ఉన్నట్లు పరీక్షల ద్వారా నిర్దారణ అయితే ప్రభుత్వం మే వైద్య చేపిస్తుందని తెలిపారు. ఉపసర్పంచ్ సిద్దార్థ మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం నిర్వహించిన ప్రజలు భాగస్వామ్యూలై సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఎంజీఎం హాస్పిటల్ స్పెషలిస్ట్ లు, పీహెచ్సీ వైదులు, dr. మౌనిక, dr. సంయుక్త, ప్రభాకర్, వైద్య సిబ్బంది, ఆశలు పాల్గొన్నారు.