సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 15 రామకుప్పం రిపోర్టర్ జయరాం రెడ్డి చిత్తూరు జిల్లా, కనుచూపు మేర పచ్చదనం సర్వాంగ సుందరంగా మారిన రోడ్లు అక్కడక్కడ నిండిన చెరువులు ప్రగతికి చిహ్నాలుగా మారాయి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో భాగమైన రామకుప్పం మండలంలో రోజురోజుకు అభివృద్ధి పరుగులు తీస్తోందని చెప్పవచ్చు గతానికన్నా ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు జనం పేర్కొంటున్నారు నిండు వేసవిలో నీరు లేక జనం తాగేదానికి ఇబ్బందులు పడేవారు ప్రస్తుతం ముఖ్యమంత్రి పుణ్యాన కృష్ణా జలాలను సుమారు 750 కిలోమీటర్ల దూరం నుండి తీసుకొచ్చి కుప్పానికి తీసుకురావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు సాగుకు తాగేందుకు నీరు పుష్కలంగా లభిస్తాయని పేర్కొంటున్నారు నిండు వేసవిలో రైతులు వరి సాగు చేసి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి రోడ్లు చిహ్నంగా భావించారు దీంతో మండలంలో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు తారు రోడ్లు దర్శనమిస్తాయి అక్కడక్కడ మట్టి రోడ్ల తప్ప గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి చెంది రాకపోకలు సులభమయ్యాయి అదేవిధంగా త్వరలో ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పరిశ్రమల స్థాపన జరుగునున్నాయి దీంతో భవిష్యత్తులో రామకుప్పం మండలం రూప రేఖలు పూర్తిగా మారుతున్నట్లుతెలుస్తోంది భవిష్యత్తులో ఊహించని రీతిలో అభివృద్ధి జరుగుతుందని పలువురు సూచిస్తున్నారు ఏది ఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కుప్పం ప్రజలు రుణపడి ఉండాలని భావితరాల వారికి మరింత అభివృద్ధి పలాలు అందవచ్చని తెలుస్తోంది ఇదిలా ఉండగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పి ఫోర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దీంతో పలువురు వాళ్ళ కుటుంబాలని దత్తకు తీసుకుని వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించారు అదేవిధంగా యువతకు ఉపాధి కల్పించే విధంగా కడ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న చొరవతో ప్రభుత్వం ముందుకు చర్యలు చేపట్టింది ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విధాలుగా అభివృద్ధి సాధించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తుందని చెప్పవచ్చు.
