పేరి వెంకటరెడ్డికి ఘన సన్మానం

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చ్ 15, (శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పేరి వెంకటరెడ్డిని శనివారం మయూరి నగర్ కమ్యూనిటీ హాల్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లా ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఐక్యవేదిక తాత్కాలిక అధ్యక్షుడు కె.కోటయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు వెంకటరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే వేదికపై, గత నెలలో రోడ్డు ప్రమాదంలో మరణించిన డ్రైవర్ శర్మంద కుటుంబానికి ఐక్యవేదిక తరపున పది వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలమూరు జిల్లా ఐక్యవేదిక నాయకులు, మయూరి నగర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *