పుట్టగొడుగుల్లా వెలిసిన ప్రైవేటు పాఠశాలలు

*మరికల్ మండల కేంద్రంలో అధిక ఫీజులను అసలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు !?… *పట్టించుకోని ప్రభుత్వ అధికారులు….. *ఎల్కేజీ యూకేజీ…. ముక్కు పిండి వసూలు చేస్తున్న అక్రమ ఫీజులు ప్రైవేటు విద్యాసంస్థలు……

సాక్షి డిజిటల్ న్యూస్, మరికల్, మార్చ్ 15, 2026,( రిపోర్టర్ ఇమామ్ ), వచ్చే విద్యా సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నూతన విద్యా విధానంను మార్పులు చేస్తానని ఇటీవల ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని పలు రాజకీయ పార్టీల నాయకులు, విద్యావేత్తలు ఇది సాధ్యం కాదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన విద్యాబోధన లేనందువల్ల ప్రజలు ప్రైవేటు విద్యాసంస్థలను ఆశ్రయిస్తున్నారని విద్యావంతులు చర్చించుకుంటున్నారు. 50 సంవత్సరాల కిందట ఉన్న విద్యా ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం లేదన్నారు. అప్పట్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు బదిలీ అయిన ప్రవేశంలోనే కుటుంబంతో జీవనం గడిపేవారని అంటున్నారు అందుచేత ప్రభుత్వం బాధ్యతగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే వారని విద్యావంతులు అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలో వదిలి ఉద్యోగానికి హాజరవుతున్నారని పలువురు అంటున్నారు. అప్పటిలో ఏ గ్రామంలో పనిచేసే ఉపాధ్యాయులకు బాధ్యతగా మెలిగేవారని అంటున్నారు. ప్రతి నెల లక్షల రూపాయలు ఒక్కొక్క ప్రభుత్వ ఉపాధ్యాయుడికి వేతనాలు చెల్లిస్తున్న అవన్నీ నిరుప యోగమే అవుతున్నదని గ్రామీణులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో సరైన విద్యాబోధన లేనందు వలనే విద్యార్థుల తల్లిదండ్రులు కూలినాలి చేసి తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారి వారి పిల్లలను ప్రైవేటు విద్యాసంస్థలలో కష్టపడి శ్రమ వచ్చి చదివిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని మార్పులు చేసిన అవి కార్యరూపం దాల్చినంతవరకు ప్రభుత్వం విద్యా విధానంలో ఎన్ని మార్పులు తీసుకొని వచ్చినా అవన్నీయు బూడిదలో పోసిన పన్నీరే అవుతుందన్నారు. గత 30 సంవత్సరాల నుండి అండదండలతో ప్రైవేటు విద్యాసంస్థలు మనుగడ సాధిస్తున్నాయని పలువురు ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. కనీసం విద్య విధానంలో మార్పులు రాకున్నా ప్రైవేటు విద్యాసంస్థలలో సరైన విద్యా బోధనను అమల్లో ఉందని గ్రామీణులు తమ పిల్లలను ప్రైవేటు విద్యాసంస్థలకు విద్యాబోధనకు పంపుతున్నారని అంటున్నారు. ప్రభుత్వ అండదండలతో వీళ్లకు వేల రూపాయలు లెక్క లేకుండా లక్షల వరకు ఒక్కొక్క విద్యార్థి నుంచి ప్రవేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్న మండల విద్యా అధికారి,జిల్లా అధికారి ఏమాత్రం పట్టించుకోవడం లేదని పలు సంఘాల నాయకులు వాపోతున్నారు. ఉదాహరణకు నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో ప్రైవేటు విద్యాసంస్థలు చాలా వెలిశాయన్నారు అక్రమంగా విచ్చలవిడిగా విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయడం వల్ల వారు సొంత భవనాలను లక్షల రూపాయలతో ఖర్చు చేసి నిర్మించు కుంటున్నారని చర్చించుకుంటున్నారు. ఇక్కడ విద్యా సంఘాలు ప్రైవేటు పాఠశాలలపై అక్రమ వసూలు ఎందుకు చేస్తున్న విషయంపై అధికారులు అరికట్టడం లేదని పలు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మరికల్ మండలంలో ప్రవేట్ పాఠశాలలు అక్రమంగా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాధికారులు పట్టించుకోకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులు నియంత్రణ చేస్తామని ప్రకటించిన ప్రకటన వారికే ప్రస్తుతం అయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ లేకపోతే కొంతవరకు ఏమాత్రం మార్పు సాధ్యం కాదని ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులు తగ్గే స్తే నే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించినట్లు విద్యా విధానంలో మార్పు సాధ్యం అవుతుందని పలువురు అంటున్నారు. ఈ మేరకు మరికల్ మండల కేంద్రంలో ప్రైవేటు విద్యాసంస్థలపై ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలను తనిఖీలు నిర్వహించి, ఫీజులను అరికట్టి చర్యలు తీసుకోవాలని విద్య సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరికల్ మండల కేంద్రంలో ప్రవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా అధిక ఫీజులు వసూలు చేయడంపై నారాయణపేట జిల్లాలోని చర్చినివిషంగా మారింది ని మరికల్ మండలంలో చర్చించుకుంటున్నారు. నారాయణపేట జిల్లా కలెక్టర్, జిల్లా డీఈవో, మరికల్ మండలం ఎంఈఓ లు మరికల్ ప్రైవేట్ పాఠశాలలను పరిశీలించి అక్రమ ఫీజుల వసూళ్లపై చర్యలు తీసుకోవాలని విద్యా సంఘాలు, మరికల్ మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *