సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 15 : వలిగొండ రిపోర్టర్ కుమారస్వామి. పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద మండలం లో పోలీస్ నిషేధాజ్ఞలు అమలు లో ఉంటాయని వలిగొండ ఎస్సై యుగంధర్ శుక్రవారం తెలిపారు.ఈ నెల 14 నుండి ఏప్రిల్ 16 వరకు జరిగే 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ప్రజలు గుంపులుగా చేరడంపై నిషేధ ఆజ్ఞలు సెక్షన్ 163 బి.యన్.యస్.యస్ యాక్ట్ – (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) (144)అమలులో వుంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు నలుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలని సూచించారు. పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా అమలు చేస్తున్నట్లు ఎస్సై యుగంధర్ తెలిపారు.