పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

సాక్షి డిజిటల్ న్యూస్ భీముని పట్నం, రిపోర్టర్, (బోయి అప్పలరెడ్డి) మార్చి 15: భీమిలి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం గాంధీ బాలికా విద్యాలయ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి ఎస్ ఆర్)లో భాగంగా ఫామ్ జోన్ వారి సహకారంతో రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ (ఆర్‌డబ్ల్యూఎస్) సేవా సంస్థ ఆధ్వర్యంలో సుమారు 38 మంది విద్యార్థులకు ఈ ప్యాడ్లు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. ఊహ మహంతి మాట్లాడుతూ విద్యార్ధినులు క్రమశిక్షణతో చదివి పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కె జి బి వి ప్రధానోపాధ్యాయులు గంగా కుమారి మరియు ఉపాధ్యాయులు, ఫామ్ జోన్ కంపెనీ ప్రతినిధులు మరియు ఆర్‌డబ్ల్యూఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *