పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

సాక్షి డిజిటల్ న్యూస్ 14 మార్చి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మండల విద్యాశాఖ అధికారి వివి ఈశ్వరరావు శనివారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 500 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు కు హాజరవుతారని ఆయన తెలిపారు మండలంలోని 13 ప్రభుత్వ పాఠశాల 2 ప్రైవేట్ పాఠశాల కు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తారని అన్నారు ఈ ఏడాది అదనంగా జీనబాడు పినకోట ఆశ్రమ పాఠశాల చెందిన విద్యార్థులు మండల కేంద్రం లోని దేవరాపల్లి పరీక్ష కేంద్రాలకు పరీక్షలు రాసేందుకు హాజరవుతారని విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు ఈనెల 16 నుంచి ఏప్రిల్ 1 తేదీ వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ నిర్వహించడం జరుగు తుందన్నారు.