పదవతరగతి విద్యార్థులకు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ప్రోత్సాహం చాలా అవసరం

★శాసన సభ్యులు జారే ఆదినారాయణ

అక్షర ఆయుధం అశ్వారావుపేట మార్చ15(ch.సతీష్)(రిపోర్టర్)గండుగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి ఈరోజు నుంచి ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరీక్షలు రాయనున్న విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా పరీక్షలు రాయనున్న విద్యార్థులకు పలు ముఖ్య సూచనలు చేశారు.ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి. పదవ తరగతి విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు చదువుపై నమ్మకం పెట్టుకుని ప్రశాంతంగా పరీక్ష రాస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారని తెలిపారు. పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలి.విద్యార్థులు పరీక్షకు ఆలస్యంగా కాకుండా కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు హడావుడిగా రావడం వల్ల టెన్షన్ పెరిగే అవకాశం ఉంటుందన్నారు.ప్రశ్నాపత్రాన్ని పూర్తిగా చదివి సమాధానాలు రాయాలి.పరీక్ష మొదలైన తర్వాత తొందరపడకుండా ప్రశ్నాపత్రాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకుని సమాధానాలు రాయాలని సూచించారు అప్పుడు తప్పులు తక్కువగా ఉంటాయని చెప్పారు.సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి
పరీక్ష సమయంలో సమయాన్ని సరిగ్గా పంచుకుని ప్రతి ప్రశ్నకు సమాధానం రాయాలని సూచించారు చివరిసారిగా రాసిన సమాధానాలను మరొక్కసారి పరిశీలించుకోవడం మంచిదని తెలిపారు.ఈ పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులకు ధైర్యం చెప్పి ప్రోత్సహించాలని కోరారు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయడానికి విద్యార్థులకు సహకరించాలని సూచించారు