పటాన్చెరులో గత 27 సంవత్సరాలుగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం హర్షనీయం..

*ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం నిలిచిపోవాలని అల్లాను ప్రార్థించండి.. *ముస్లింల సంక్షేమానికి సంపూర్ణ సహకారంఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి *ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు *భారీ సంఖ్యలో హాజరైన ముస్లింసోదరులు, సీనియర్ నాయకులు ముఖ్య అతిథిగా తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి మహమూద్అలీ..

సాక్షి డిజిటల్ న్యూస్ పటాన్చెరు నియోజకవర్గం ప్రతినిధి అరుణ.. పటాన్చెరు గంగా జమున తెహజీబ్ సంస్కృతికి ప్రతీక తెలంగాణ రాష్ట్రమని.. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట వేసిన మహోన్నత నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. గత 27 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కే దక్కిందని ప్రశంసించారు. శుక్రవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మహమ్మద్ అలీతో పాటు, శాసనమండలి మాజీ ప్రోటైం చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహమూద్ అలీ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్రంలోని ముస్లింల అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి మరువలేనిదని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ.. గొప్ప సెక్యులర్ వాదిగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నిలిచిపోతున్నారని అభినందించారు. సొంత నిధులతో ఆశిర్ఖానాలు, మసీదులు, దర్గాలు నిర్మించడం అభినందనీయమన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం ముగిసిపోయేలా అల్లాను ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో పుష్కలంగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించాలని కోరారు. నియోజకవర్గంలో కులం మతం ప్రాంతాలకు అతీతంగా పరమత సహనం పెంపొందిస్తున్నామని తెలిపారు. ముస్లింల అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ముస్లింలకు తగు ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు.. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, విందు భోజనాలు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *