నూతన గ్రామపంచాయతీ భవనానికి శరవేగంగా పనులు

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 14 /3/2026 అచ్చంపేట రూరల్ ( రిపోర్టర్ కాలూరి మల్లేష్ ) నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం తిప్పాపూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణ పనులు సర్పంచ్ మహేష్ సింగ్ ఆధ్వర్యంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈరోజు అందులో భాగంగానే గ్రామపంచాయతీ భవనానికి చేత్తువేయడం జరిగింది. దీనికి డిప్యూటీ సర్పంచ్ గ్రామ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు అందరి సహకారంతో ముందుకు పోతున్నానని సర్పంచ్ మహేష్ సింగ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లో చేస్తున్న అభివృద్ధిలో భాగంగా సహకారంతో వారి అండదండలతో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రకటించి ఎన్ఆర్ఐ జిఎస్ నిధులు 20 లక్షల రూపాయలు కేటాయించి పూర్తి చేయిస్తున్న ఎమ్మెల్యే గారికి ఎల్లప్పుడు అన్నదండగా ఉంటామని ఎల్లవేళలా ప్రభుత్వానికి సహకరిస్తామని మహేష్ అన్నారు..గ్రామాన్ని అభివృద్ధికి సహకరిస్తున్న గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికి కృతజ్ఞతలు తెలియజేసిన మహేష్ సింగ్. ఇలాగే ప్రతి ఒక్కరు గ్రామ అభివృద్ధికి సహకరిస్తే ఎమ్మెల్యే సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ చంద్రయ్య యాదవ్, వార్డ్ మెంబర్లు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.