నా కన్నా కొడుకు నెలవారి నిర్వహణ డబ్బులు ఇస్తలే

సాక్షిడిజిటల్ న్యూస్, మార్చి15, రాయికల్ :సీనియర్ సిటిజన్ సురతాని రాజారెడ్డి ( 75) అనే తన కొడుకు తనకు నెలవారి మెంటనేన్స్ ఇవ్వడం లేదనని ఆవేదన వ్యక్తం చేశారు.జగిత్యాల జిల్లా రాయికల్ లో శనివారం రాజరెడ్డి పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ జగిత్యాల ఆర్డీవో కార్యాలయం వారి సర్కులర్ ఉ.నెం. సి .1542/2022 తేదీ 15-04-2023 ని అనుసరించి సబ్ డివిజనల్ ట్రిబ్యునల్ వెల్ పెర్ ఆఫ్ పేరెంట్స్ మరియు సీనియర్ సిటిజన్స్, సబ్ డివిజనల్ అధికారి ఉత్తర్వు ప్రకారం తన పెద్ద కొడుకు పాటించడం లేదని
తనకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.నెలవారి నిర్వహణ డబ్బులు ఇవ్వడం లేదని.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని షుగర్, బీపీ వయోభారంతో అనేక రోగాల పాలవుతున్నానని అధికారులు ఇచ్చిన ఉత్తర్వు ను మండల స్థాయి అధికారులు తక్షణమే అమలు చేసి నాకు న్యాయం చేయాలని కోరారు.మెడిసిన్ కు దాదాపు పదివేల కు పైగా ఖర్చు అవుతుందని దానికి ఆర్థిక సహకారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఇటీవల కూడా జిల్లా అధికారులకు మరోసారి విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *