దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ ,వేంపల్లె,మార్చి :15( పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) వేంపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గమ్మ ఆలయాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శనివారం సందర్శించారు. ఆయనకు ఆలయ నిర్వాహకుడు మాచిరెడ్డి రవి కుమార్ రెడ్డి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఎంపి అవినాష్ రెడ్డి ని శాలువ కప్పి పూలదండలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చక్రాయపేట జడ్పిటిసి తాటిగుట్ల శివప్రసాద్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.