దళిత మహిళ వైస్ చైర్మన్ కు అవమానం

★పరకాల మున్సిపల్ అధికారులపై ఏక శంకర్ మాదిగ మండిపాటు

సాక్షి డిజిటల్ న్యూస్ హన్మకొండ జిల్లా.15/3/2026 పరకాల నియోజకవర్గం సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ మడికొండ పవన్ కుమార్ పరకాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ ఏకు దివ్యకు జరిగిన అవమానంపై ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ తీవ్రస్థాయిలో మండిపడ్డారు శుక్రవారం జరిగిన సభలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ ప్రజా ప్రతినిధిని వేదికపైకి ఆహ్వానించకుండా సాధారణ సభ్యుల వరుసలో కూర్చోబెట్టడం మున్సిపల్ ప్రోటకాలను తుంగలో తొక్కడమేనని ఆయన మండిపడ్డారు ప్రోటోకాల్ పాటించరా వైస్ చైర్మన్ ను వేదిక పైకి పిలవకపోవడం వివక్ష అని అన్నారు కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ లేని పక్షంలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సందర్భంగా శంకర్ మాదిగ మాట్లాడుతూ మున్సిపాలిటీలో రెండో అత్యున్నత పదవిలో ఉన్న వైస్ చైర్మన్ ను వేదికపైకి పిలవకపోవడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు చైర్మన్ పక్కన కూర్చోవాల్సిన వైస్ చైర్మన్ ను కింద కూర్చోబెట్టడం అంటే అది కేవలం ప్రోటోకాల్ ఉల్లంఘన మాత్రమే కాదు దళిత మహిళ నేతపట్ల ప్రదర్శించిన అహంకారం మరియు వివక్షత అని ఆయన ధ్వజమెత్తారు అధికారులు కావాలనే దళిత మహిళ వైస్ చైర్మన్ ను పక్కన పెట్టారా లేక ఎవరి ఒత్తిళ్లకు త లో గీ ఈ పని చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నిబంధనలు ఏం చెబుతున్నాయి మున్సిపల్ చట్టం ప్రకారం డయాస్ మీద చైర్మన్ వైస్ చైర్మన్ కమిషనర్లకు కచ్చితంగా స్థానం కల్పించాలి కానీ పరకాల లో నిబంధనాలను గాలికొదిలేసి ప్రజాప్రతినిధిని అవమాన పరిచేలా వ్యవహరించడం శోచనీయమని అన్నారు పరకాల ఎమ్మెల్యే కుట్రపూరితంగానే దూరహంకారంతో దళిత మహిళ వైస్ చైర్మన్ అవమానం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ కమిషనర్ రాజకీయ ఒత్తిళ్లకు త లో గీ బాధ్యత రహితంగా వల్లే ఈ పరాభవం జరిగిందని ఆయన ఆరోపించారు వెంటనే ఈ ఘటనపై ఉన్నత అధికారులు విచారణ జరిపి ప్రోటోకాల్ పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని శంకర్ మాదిగ డిమాండ్ చేశారు బాధ్యులను సస్పెండ్ చేయాలని లేని పక్షంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో పాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన లు చేపడుతామని హెచ్చరించారు దళిత ప్రజాప్రతినిధులకు ఆత్మగౌరవం దక్కే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.