త్రాగునీటి సమస్య వస్తే చర్యలు తప్పవు ….. ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశం

★ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 15 భూమయ్య పిట్లం . . . ముందుంది వేసవికాలం వేసవి కాలంలో గ్రామాలలో త్రాగునీటి సమస్య వస్తే అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటానని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు హెచ్చరించారు.జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం నాడు ఎమ్మెల్యే మాట్లాడుతూ..
వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.. పైప్‌లైన్‌ల మరమ్మతులు, నిర్వహణ పనులను తక్షణమే పూర్తి చేసి నీటి సరఫరా అంత రాయం లేకుండా చూడాలని ఆదేశించారు..మోటార్ల సమస్యలు వంటి చిన్న చిన్న లోపాలను కూడా వెంటనే గుర్తించి పరిష్కరించాలని చెప్పారు. నిధులు లేకపోతే తన దృష్టికి తీసుకువస్తే నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరుగుతున్నదో లేదో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఎమ్మెల్యే సూచించారు..అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ సమావేశంలో ప్రతి అధికారి కూడా శుద్ధ వహించి గ్రామ గ్రామానికి త్రాగునీరు అందించాలని కోరారు. జుక్కల్ నియోజకవర్గం అధికారులు పాల్గొన్నారు.