తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భారీ ర్యాలీ కి పిలుపు

అక్షర ఆయుధం న్యూస్., హిమాoబరదర్(రిపోర్టర్) భద్రాచలం.,14/3/26 కేజీబీవీ / యు ఆర్ ఎస్/ ఎస్ ఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మార్చి 16న భద్రాచలంలో నిర్వహించే ర్యాలీ, ప్రదర్శనను విజయవంతం చేయాలి.కేజీబీవీ; యు ఆర్ ఎస్ . సమగ్ర శిక్షణలో ఎస్ ఎస్లో పనిచేస్తున్న బోధన మరియు బోధనేతర ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం మార్చి 16వ తేదీన సాయంత్రం 4 గంటలకు భద్రాచలంలో యుటిఎఫ్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించనున్న ర్యాలీ మరియు నిరసన ప్రదర్శనను భారీగా విజయవంతం చేయాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, సేవా నియమాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం సత్యనారాయణ మాట్లాడుతూ , కేజీబీవీ యు ఆర్ ఎస్సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో, అనిశ్చిత పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించి తక్షణమే సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు