సాక్షి డిజిటల్ న్యూస్ : మార్చి 15, (ప్రకాశం & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్ : షేక్ మక్బూల్ బాష).
తాడికొండ తహసిల్దార్, ఆర్ఐ ఇద్దరు వీఆర్వోలను సస్పెండ్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ “ఏ.తమీమ్ అన్సారియా” ఉత్తర్వులు జారీ చేశారు. భూమి మ్యుటేషన్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా, లోపబోయిష్టంగా వ్యవహరించడం పట్ల విచారణ చేపట్టి వారిని దోషులుగా నిర్ధారించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ అయిన వారిలో తహసిల్దార్ పి.మెహర్ కుమార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఎన్.హనుమంతరావు, తాడికొండ – 3 స్వర్ణ గ్రామం గ్రామ రెవెన్యూ అధికారి టి.బ్రహ్మయ్య, తాడికొండ – 4 స్వర్ణ గ్రామం గ్రామ రెవెన్యూ అధికారి జి.రాంబాబు ఉన్నారు. వీరిని సస్పెండ్ చేయడం ద్వారా ఇలాంటి తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్వయంగా హెచ్చరించినట్లు అయింది.