ట్యాంకర్ల ద్వారా గ్రామంలో త్రాగునీరు సరఫరా చేసిన టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ వీరేంద్ర

*ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద, మార్చ్ 14, మండల పరిధిలోని చిన్నహ్యాట పంచాయతీ పరిధిలోనీ బి.జి. హళ్లి గ్రామంలో త్రాగునీరు సరఫరా చేసే మోటారు చెడిపోవడంతో గత 15 రోజులుగా తాగునీరు రాక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న ఆలూరు ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి గ్రామంలో వెంటనే తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు.ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు,గ్రామ టీడీపీ నాయకులు,క్లస్టర్ ఇంచార్జ్ వీరేంద్ర శనివారం గ్రామంలో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేశారు.దీర్ఘకాలంగా నీటి కోసం ఇబ్బంది పడుతున్న తమ సమస్యను గుర్తించి,తక్షణమే నీటిని అందించినందుకు గ్రామస్థులు టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి,క్లస్టర్ ఇంచార్జ్ వీరేంద్రలకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *