టి నగరపాలెం గ్రామంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్ భీముని పట్నం, ,రిపోర్టర్ (బోయి అప్పలరెడ్డి) మార్చి 15: భీమిలి మండలం టి.నగరపాలెం గ్రామ పంచాయతీలో భీమిలి మండల జనసేన పార్టీ సెక్రెటరీ పొట్నూరు కొండబాబు గ్రామ పార్టీ అధ్యక్షులు ఇద్దిపిల్లి నానాజీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి మండల అధ్యక్షులు నక్కా శ్రీధర్ హాజరై జనసేన పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచిపెట్టి భీమిలి మండలంలో 16 పంచాయతీల్లో పార్టీని ముందుకు నడిపించే దిశగా నాయకులు కార్యకర్తలు అడుగులు వేయాలని పార్టీని గ్రామ గ్రామాన ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడగల గురునాయుడు జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు గిడిజల పాపారావు, ఎరుసు సూరిరెడ్డి ప్రధాన కార్యదర్శులు కొయ్య శ్రీను, ముద్దాడ శ్రీను, సీనియర్ నాయకులు ఉమ్మడి మొగ్గయ్య, గుడివాడ కిరణ్, దొర, మండల జాయింట్ సెక్రటరీ కాళ్ళ పవన్, ఐటీ కోఆర్డినేటర్ ఆల్తి వెంకటేష్, సోషల్ మీడియా లొడగల ఎర్నినాయుడు, టీ నగరపాలెం గ్రామ పంచాయతీ ప్రధాన కార్యదర్శి కర్రి వెంకటేష్, ఉపాధ్యక్షులు పల్లా రమణ, సెక్రటరీలు మాకిన శ్రీకాంత్, మరుపిల్లి వెంకట అప్పారావు, దువ్వి పైడిరాజు, తమ్మిన గణేష్, సీనియర్ నాయకులు పొట్నూరు అన్నాజీ, తమ్మిన ఎల్లారావు , పొట్నూరు శంకర్రావు, యువనాయకులు రాంపల్లి సాయి, వాoడ్రాసి అరవింద్ ,గూడేల సాయి,నరేష్ 16 పంచాయతీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.