జోగిపేటలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.

అందోల్ మార్చి 15 సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి జెల్ల భాగయ్య ( సౌలు) అందోల్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శ్రీరామ గార్డెన్లో రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీ నాయకులు తమ ఉపవాస దీక్షలు ఉన్న సందర్భంగా మైనార్టీలలో కలిసి ఇఫ్తార్ విందులో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. మైనార్టీ మహిళలకు బట్టల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.