సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 15 చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ కొండూరి సురేష్, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నాగరాజు,డాక్టర్ రాకేష్ వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి షుగర్, బీపీ,ఈసీజీ, టుడి-హెచో పరీక్షలు చేపట్టి రోగనిర్దారణ తరువాత మందులు ఇచ్చారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నమని, మెడికవర్ ఆసుపత్రిలో 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.ఈ శిబిరంలో సర్పంచ్ జీవన్ రెడ్డి, ఉప సర్పంచ్ గుర్రం నర్సయ్య, మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, దాసరి చంద్రశేఖర్, వినోద్ , మహేష్, తదితరులు పాల్గొన్నారు.