(సాక్షి డిజిటల్ రిపోర్టర్ విగ్నేష్ మార్చ్ 15) దీపాయంపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నర్సరీ ఏర్పాటు దౌల్తాబాద్ మండలంలోని దీపాయంపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ నర్సరీ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ గద్వాల్ దుర్గేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గజ్వేల్ దుర్గేష్ మాట్లాడుతూ గ్రామంలో పచ్చదనం పెంపొందిం చేందుకు నర్సరీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చెట్లు, మొక్కలు బాగా పెరిగేలా ప్రతి మొక్కకు చల్లదనం ఉండేందుకు ప్రత్యేకంగా గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాన్ని మరింత పచ్చగా, స్వచ్ఛంగా మార్చడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మసూరి శ్రీశైలం, వార్డ్ మెంబర్ చెక్కురు స్వామి, పంచాయతీ కార్యదర్శి, పారిశుద్ధ్య కార్మికులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.