గ్రామపంచాయతీ ఆవరణంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ గాజుల శ్రీనివాస్ గౌడ్ మార్చి 15/03/2026 వెల్గటూర్ మండలం. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యామా గ్రామపంచాయతీ ఆవరణంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ గ్రామ ప్రజలకు మరియు గ్రామ పెద్దలకి బాలవివాహంపై అవగాహన కల్పించడం జరిగింది.బాల్య వివాహాల నిరోధక చట్టం- 2006 ప్రకారం 18 సంవత్సరాల లోపు అమ్మాయికి 21 సంవత్సరంలోపు అబ్బాయికి వివాహం చేయడం చట్టరీత్యా నేరమని అందుకు రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడునని అదేవిధంగా బాల్యవివాహాల వల్ల పిల్లలకు భవిష్యత్తులో మానసిక శారీరక ఎదుగుదల ఆగిపోతుందని అలాగే ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రోత్సాహాలు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ వంటి పథకాలు వర్తించవని, అలాగే 18 సంవత్సరాల లోపు బాలబాలికలకి రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లల కొరకు 24 గంటలు పనిచేసే ఉచిత అత్యవసర ఫోన్ సేవా సౌకర్యం చైల్డ్ హెల్ప్ లైన్1098 పోలీస్ 100, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టం 112, మహిళల కోసం 181 సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాల్య వివాహాలు లేని భారతదేశ కోసం ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ శ్రావణ్, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సహాయ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కౌన్సిలర్ లత, గ్రామ సర్పంచ్ కుమ్మరి మల్లేశ్వరి ఎల్లయ్య మరియు ఉపసర్పంచ్ రమేష్ వార్డు నంబర్ అనుమళ్ల శ్యామల శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ రంగు తిరుపతి గౌడ్ గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *