సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా. మిద్దె మల్లేష్ యాదవ్ 15/03/2026, వంటగ్యాసు సిలిండర్ రా కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్ లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీసారని హైదరాబాద్ సిపి సజ్జనర్ ప్రజలను అలర్ట్ చేశారు తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ అదనపు సిలిండర్ ఇస్తామంటూ సామాజిక మద్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారని వాట్సాప్ ఎస్ఎంఎస్ ల ద్వారా ఫేక్ వెబ్సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అప్రమత్తం చేశారు ముఖ్యంగా ఆన్లైన్లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారంటీగా అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే సందేహాలు వస్తే అవి కచ్చితంగా సైబర్ మోసాలేనని ప్రజలు గ్రహించాలన్నారు ఇలాంటి అనుమానస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని సూచించారు సిలిండర్ బుకింగ్ లేదా ఆన్లైన్ చెల్లింపుల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లను లేదా అధికృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలన్నారు ఆకర్షణీయమైన చూసి గుర్తుతెలియని వ్యక్తులకు మీ బ్యాంకు ఖాతా వివరాలు ఓటిపి యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితిలోనూ పంచుకోకూడదని సిపి సజ్జనార్ సూచించారు. నకిలీ వెబ్సైట్లో వివరాలు నమోదు చేయడం ద్వారా మీ వ్యక్తిగత ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని అప్రమత్తం చేశారు ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 19 30 కి కాల్ చేయాలి లేదా https://cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
