గాదే నరసింహ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణ

★పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి 33 వేల రూపాయలతో ఆర్థిక సహాయం

సాక్షి డిజిటల్ న్యూస్,14 మార్చి 2026, రామన్నపేట మండలం రిపోర్టర్, శ్యామల నాగరాజు వంశరాజ్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పట్టణంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు గాదే నరసింహ కుటుంబానికి గ్రామపంచాయతీ నిధుల నుంచి రూ.33 వేల ఆర్థిక సాయం అందజేశారు.శుక్రవారం సర్పంచ్ గరిక సత్యనారాయణ బాధిత కుటుంబ సభ్యులకు ఈ సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీలో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన నరసింహ కుటుంబానికి గ్రామపంచాయతీ తరఫున అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోటే రమేష్, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్, వార్డు సభ్యులు, నాయకులు కొమ్ము శేఖర్, జాడ సంతోష్,మోటే మహేష్,కొమ్ము రామస్వామి, అన్వర్, నకరకంటి సుదర్శన్, గొరిగే శేఖర్, బండ లింగస్వామి, రాపోలు ఉపేందర్, ఊట్కూరు శీను, గ్రామపంచాయతీ సిబ్బంది రాజ్ కుమార్, యాదయ్య,రాము తదితరులు పాల్గొన్నారు.