గర్భిణీ మరణానికి కారణం ఏదైనా న్యాయం జరగాలి

*జరిగేలా చూస్తా అంటూ కంటతడి పెట్టుకున్న సర్పంచ్. *గిరిజన గర్భిణీ స్త్రీ అకాల మరణానికి కారకులు ఎవరు ఏంటి…? *ఈ మరణాలు ఆగాలంటే ఒకే ఒక్క మార్గం

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి 15, మణుగూరు /భద్రాద్రికొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీరాంపురం పాయం ఎస్టీ కాలనీలో ఆరు నెలల గర్భిణీ గత గురువారం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మృతి చెందిన విషయంపై పలు అనుమానాలతో వార్త కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో స్పందించిన సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరామ్ నాయక్ ఈ రోజు ఆ గిరిజన గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి కంటతడి పెట్టుకున్నారు. గర్భిణీ మృతికి సంబంధించిన కారణాల పై పలు కోణాల్లో ఆరా తీసి ఒకింత అసహనానికి గురైన సర్పంచ్. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రెండు గ్రామాల్లో కనీస మౌలిక వసతులపై ఇప్పటికే పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకొని వెళ్లి స్పష్టం చేయటం జరిగిందనీ. ఎమ్మెల్యే కూడా సానుకూలంగానే స్పందించారని అంతా మంచే జరుగుతుందని తెలియజేశారు. అలాగే రెండు గ్రామాల్లో పండించే పంట సాగు గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయానికి అనుగుణంగా ఉండే విధంగా ఉన్న చెరువులను, కుంటలను అభివృద్ధి చేసే విధంగా సంబంధిత చర్యలు తీసుకుంటానని తెలిపారు. అలాగే ఇక్కడి రెండు గ్రామాల గిరిజనలు కూడా ఎటువంటి పురుగు మందులు వాడకుండా స్వంతగా కాయ కూరలు సహజ పద్ధతిలో పండించి తినాలని తెలిపారు. అలా చేయటం వలన మీ ఆరోగ్యంతోపాటు పలువురి ఆరోగ్య ఆర్ధిక అవసరాలు కూడా మెరుగుపడతాయని తెలియజేశారు. గర్భిణీ స్త్రీల మృతి పై సర్పంచ్ తో రెండు గ్రామాల గిరిజనులు మాట్లాడుతూ మా గ్రామల లో సరైన వైద్య సదుపాయం, గర్భిణులు తీసుకోవాల్సిన పోషక ఆహారం, ఔషధాలు మొదలగు విషయం పై కనీస అవగాహన కల్పించే పరిస్థితి కుడా లేకపోవటం ఈ విధంగా గర్భిణులు మరియు శిశువుల మృతికి కారణాలు అయ్యుండవచ్చు అని పలు ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు స్పందించి మా రెండు గిరిజన గ్రామాలకి కనీస మౌలిక వసతులైన విద్య, వైద్యం, అంగన్వాడీ, మంచినీటి సరఫరా, కరెంటు సదుపాయం, పాయం ఎస్టీ కాలనీ నుంచి చింతకుంట వరకు సుమారు 650 మీటర్లు గ్రావెల్ రోడ్డు, కల్పించాలని వేడుకుంటున్న శ్రీరాంపురం పాయం ఎస్టి కాలనీ మరియు చింతకుంట గిరిజన ఆదివాసీలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *