క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి

★ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పిలుపు

అక్షర ఆయుధం న్యూస్., హేమామ్ భరధర్ (రిపోర్టర్) భద్రాచలం 14/3/26 భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నూతనంగా నియమించిన మండల అడక్ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పిలుపునిచ్చారు.ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి తీసుకొని వెళ్లి ప్రచారం చేయాలని కోరారు నియోజకవర్గ అభివృద్ధి నిధులతో మరియు గ్రామపంచాయతీ ద్వారా జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని కోరారు.పార్టీ అభివృద్ధికి కార్యక్రమాలను సమన్వయం చేయటానికి పార్టీలో ఐక్యతను పెంచడానికి వస్తున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రణాళికతో పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు.వచ్చే జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి అడక్ కమిటీ దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు.నూతన అడక్ కమిటీ నియామకం నూతన అడక్ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కో చైర్మన్గా సర్పంచ్ పూనం కృష్ణ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడగం శ్రీనివాస్ కొండి శెట్టి కృష్ణమూర్తి రత్నం రమాకాంత్ భీమవరపు వెంకటరెడ్డి చింతిరియాల రవికుమార్ బొంబోతుల రాజీవ్ లను నియమిస్తున్నట్లుఒక ప్రకటనలో తెలిపారు