కోటలో వైభవంగా గణేష్ ఎంటర్ప్రైజెస్ షోరూం ప్రారంభోత్సవం

*ముఖ్య అతిధి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా షోరూం ప్రారంభం *ఫ్రిడ్జ్, టీవీ, ఏసి సెక్షన్లను ప్రారంభించిన పలగాటి భాస్కర్, రెడ్డి మద్దాలి సర్వోత్తమ్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, మధు యాదవ్

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి 15, కోట మండల రిపోర్టర్ వెంకట కృష్ణయ్య: నెల్లూరు జిల్లా కోట పట్టణంలోని మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గణేష్ ఎంటర్ప్రైజెస్ షోరూమ్ ను శనివారం టిడిపి నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి రిబ్బన్ కట్ చేసిప్రారంభించారు. అనంతరం ఫ్రిడ్జ్, టీవీ, గోడౌన్, ఏసి సెక్షన్లను పలగాటి భాస్కర్ రెడ్డి, మద్దాలి సర్వోత్తమ్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, మధు యాదవ్ లు ప్రారంభించారు. అనంతరం నాయకులు షోరూం లోని ఎలక్ట్రానిక్ వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నూతనంగా ప్రారంభించిన గణేష్ ఎంటర్ప్రైజెస్ షోరూమ్ వ్యాపార రంగంలో రాణించాలని భవిష్యత్తులో మరెన్నో బ్రాంచీలను ఏర్పాటు చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంటర్ప్రైజెస్ షోరూమ్ నిర్వాహకులు షోరూం ప్రారంభోత్సవానికి విడివిడిగా గ్రూపులుగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు ,అతిధులకు, శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, టిడిపి మండల పార్టీ మాజీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమ్ రెడ్డి, తూపిలి రాధాకృష్ణారెడ్డి, పెన్నక్క చెరువు ఆయుకట్టు ప్రెసిడెంట్ నెల్లూరు మోహన్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, ఎంపీటీసీలు షేక్ సంశుద్ధిన్, ధారా సురేష్, వెంకన్నపాలెం సర్పంచ్ కోకర్ల మధు యాదవ్, నౌషాద్, వార్డు మెంబర్ పేర్నాటి కిరణ్, ఉప సర్పంచ్ గాది విజయ భాస్కర్, బిజెపి నాయకుడు వల్లి ప్రసాద్, వ్యాపారస్తులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *