కార్పొరేట్ కు దీటుగా కోటలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య

*తిరుపతి పార్లమెంట్ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చ్ 15, కోట మండల రిపోర్టర్ వెంకట కృష్ణయ్య: నియోజకవర్గస్థాయిలో కోట ఉన్నత పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తామని తిరుపతి పార్లమెంట్ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా, కోటలోని ఏ వి కే ఆర్ ఉన్నత పాఠశాలలో శనివారం టిడిపి నాయకులు షేక్ జలీల్ అహ్మద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి ,మండల విద్యాశాఖ అధికారి ధారా మస్తానయ్యలతో కలసి మీడియా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా జలీల్ అహ్మద్ మాట్లాడుతూ కోట మండల కేంద్రంలో 79 సంవత్సరాల చరిత్ర కలిగిన అల్లా రెడ్డి వెంకటకృష్ణారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సహకారంతో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ బాబు రాష్ట్రంలో విద్యాభివృద్ధి కొరకు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని అందులో భాగంగా నియోజకవర్గానికి కార్పొరేట్ దీటుగా ఒక పాఠశాలను నిర్మించాలని సంకల్పించారన్నారు. అందులో భాగంగా డాక్టర్ పాశం సునీల్ కుమార్ కోట ఉన్నత పాఠశాల,మెట్టు ఉన్నత పాఠశాల, చిట్టేడు ఉన్నత పాఠశాలలను పరిశీలనలో ఉంచారన్నారు. అయితే ఈ విషయాలను తెలుసుకున్న జలీల్ అహ్మద్ వెంటనే పాశం సునీల్ కుమార్ గారికి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. తీర ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల పిల్లలు పేద పిల్లలు వసతులు లేక విద్యకు దూరంగాఉన్నారని వారి శ్రేయస్సు దృష్ట్యా, వారి విద్యాభివృద్ధి దృష్ట్యా కోట, వాకాడు, చిట్టమూరు ,చిల్లకూరు మండలాల అందరి విద్యార్థులకు కోట ఉన్నత పాఠశాల అయితే అనుకూలంగా ఉంటుందని చెప్పడంతో మా విజ్ఞాపనను పరిశీలనలోకి తీసుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో కోట ఏవీకేఆర్ ఉన్నత పాఠశాలలో కార్పొరేట్ కి దీటుగా విద్యా ప్రమాణాలు రాబోతున్నాయని జలీల్ అహ్మద్ ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాలలో విశాలమైన ఆట స్థలం, ఇండోర్ స్టేడియం, లైబ్రరీ, డిజిటల్ క్లాసులు వంటి అన్ని హంగులు ఈ పాఠశాలకు ఉండడంతో అంతర్జాతీయ స్థాయి విద్యాబోధన జరిగే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో కోట ఉన్నత పాఠశాలలో 1500 మంది పిల్లలు విద్యనభ్యసించే రోజులు రాబోతున్న అని సంతోషం వ్యక్తం చేశారు. దీనికి ఎంఈఓ మస్తానయ్య గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి గారు, ఉపాధ్యాయులు అందరూ సహకరించి మన పాఠశాలను అభివృద్ధి పరచాలన్నారు. నియోజకవర్గంలో ఎన్నో పాఠశాలలో ఉన్న షేక్ జలీల్ అహ్మద్ కోరిక మేరకు కోట ఉన్నత పాఠశాలను ఎంపిక చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.మీడియా సమావేశంలో ఎంఈఓ ధారా మస్తానయ్య, ఏవి కేఆర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీలు షేక్ సంశుద్ధిన్, దారా సురేష్, వెంకన్నపాలెం సర్పంచ్ కోకర్ల మధు యాదవ్, నౌషద్ భాష, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *