కాట్రేనికోన గచ్చకాయలపొర, వాసాల తిప్ప, ఎస్ యానం శాక్రిమెంట్ ఆయిల్ సముద్ర తీర ప్రాం తంలో సుమారుగా 50,000 గుడ్లు సేకరించి

*ఇంక్యుబేషన్ సెంటర్లో 45 రోజులు భద్ర పరచగా తొలి దశలో 300 తాబేలు పిల్లలు జన్మించాయని వాటిని శనివారం ఉదయాన్నే గచ్చకాయల పొర వద్ద సముద్రంలో విడిచిపెట్టి నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 15, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు కాట్రేని కోన మండలంలో శనివారం ఉదయం. గచ్చకాయల పోరా వద్ద సముద్రపు తాంబేలు పిల్లలను. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా సముద్రపు తాబేలు పిల్లలను విడిచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్రపు తాబేళ్ల సంరక్షణలో ఇంక్యు బేషన్ సెంటర్ల పాత్ర చాలా కీలకమైనదన్నారు. తీర ప్రాంతాల్లో దొరికిన గుడ్లను సురక్షితంగా పిల్లలుగా మార్చే ప్రక్రియహ్యాచరీ మేనేజ్‌మెంట్’ అటవీ శాఖ విభాగం చేపట్టిం దన్నారు.ఈ ప్రక్రియలో ప్రధానంగా ఐదు దశలు ఉంటాయనీ, మొదటిగా గుడ్ల సేకరణ రవాణా తాబేళ్లు ఇసుకలో గుడ్లు పెట్టి వెళ్ళి పోయిన తర్వాత, కుక్కలు లేదా ఇతర జంతువుల నుండి వాటిని రక్షించడానికి అటవీ శాఖవారు వాటిని సేకరించడం జరిగిందన్నారు గుడ్లను సేకరించేటప్పుడు వాటిని తిప్పకూడదు గుడ్డు లోపల ఉండే పిండం దెబ్బతినకుండా, అది ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో గంపలు సంచులలో ఉంచి సెంటర్‌కు తరలించడం జరుగుతుందన్నారు. జిల్లా అటవీశాఖ అధికారి ఎన్ వి ప్రసాద్ రావు ప్రసంగిస్తూ కృత్రిమ గూళ్ళ నిర్మాణం ఇంక్యుబేషన్ సెంటర్‌లో సహజ సిద్ధమైన గూడును పోలి ఉం డేలా ఇసుకలో గుంతలు త వ్వడం జరుగుతుందన్నారు. సాధారణంగా 1.5 నుండి 2 అడుగుల లోతులో, పైభాగం ఇరుకుగా మరియు అడుగు భాగం వెడల్పుగా కుండ ఆకారంలోఉండేలా గూడును సిద్ధం చేయడం జరుగుతుం దన్నారు.సేకరించిన గుడ్లను జాగ్రత్తగా ఈ గూడులో ఉంచి, పైన ఇసుకతో కప్పేస్తారన్నారు. ప్రతి గూడుకు ఒక నంబర్ మరియు గుడ్లు పెట్టిన తేదీని గుర్తుగా పెడతారన్నారు ఇసుక ఉష్ణోగ్రత సుమారు 29 డిగ్రీలు కంటే ఎక్కువగా ఉంటే ఆడ తాబేళ్లు, తక్కువగా ఉంటే మగ తాబేళ్లు పుట్టే అవకాశం ఉంటుందన్నారు. పొదిగే రకాన్ని బట్టి తాబేలు గుడ్లు పిల్లలుగా మారడానికి సాధారణంగా 45 నుండి 60 రోజులు పడుతుంద న్నారు. ఈ సమయంలో గూళ్ల చుట్టూ నెట్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది తద్వారా పిల్లలు బయటకు వచ్చినప్పుడు వేరే చోటికి వెళ్లకుండా సురక్షితంగా ఉంటాయన్నారు సముద్రంలోకి విడుదల చేయడం గుడ్ల నుండి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత, వాటిని వెంటనే సముద్రంలోకి వదలడం ఉత్తమం అన్నారు సాధార ణంగా రాత్రి వేళల్లో లేదా తెల్లవారుజామున వీటిని విడుదల చేస్తారన్నారు అదేవిధంగా తెల్లవారు జామున గచ్చకాయలపరు నందు తాబేలు పిల్లలను విడుదల చేయడం జరిగిందన్నారు దీనివల్ల పక్షులు లేదా ఎండ వేడి నుండి వాటిని రక్షించవచ్చు నన్నారు. పిల్లలను నేరుగా నీటిలో వేయకుండా, తీరానికి కొంచెం దూరంలో ఇసుకపై వదులుతారన్నారు. దీనివల్ల అవి సముద్రం వైపు పాకుతూ వెళ్తాయన్నారు. అవి పెద్ద య్యాక మళ్ళీ అదే తీరానికి వచ్చి గుడ్లు పెట్టడానికి సహాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రవి కిరణ్ అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *