ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలి

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 15 మంచిర్యాల జిల్లా బ్యూరో ఇంచార్జ్ రావుల రాంమోహన్. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలని బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీ జనాభా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీల శాతం కేవలం 9 శాతం మాత్రమే ఓ పక్క మా జనాభా ఎంతో మా వాటా అంత కావాలని ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ మా వాటా ఇవ్వకపోగా మండల కమిషన్ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన పాపాన పోలేదు ఏ ప్రభుత్వం. కనీసం ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే నిరుద్యోగ బిసి యువతకు అవకాశాలు కల్పించిన వారు అవుతారు. ఎలాగూ ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలు చేయడంలేదు కనీసం ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలోనైన 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసి బీసీ యువతకు న్యాయం చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తున్నాం .లేని పక్షంలో నిరుద్యోగ యువతతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ ,శాఖ పూరి బీమ్సేన్ ,రాజన్న చారి ,చంద్రగిరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *