ఉప్పల్‌లో గ్యాస్ ధరల పెరుగుదలపై ఆగ్రహ జ్వాలలు – నిరసనలో పాల్గొన్న ఇర్షాద్ ఖాన్ (ఉప్పల్ ఖాన్)

★ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మక్ అజయ్..

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 15,2026 మేడ్చల్ మల్కాజిగిరి రిపోర్టర్ చంద్రశేఖర్. ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల మరియు కొరతపై యువజన కాంగ్రెస్ నాయకులు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆకారపు అరుణ్ పటేల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వరుసగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ, మరోవైపు గ్యాస్ కొరతను సృష్టించడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మక్ అజయ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని విమర్శించారు.ఈ కార్యక్రమంలో స్థానిక యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువత, విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఇర్షాద్ ఖాన్ (ఉప్పల్ ఖాన్) కూడా పాల్గొని ప్రజా సమస్యలపై ఎప్పటి కప్పుడు పోరాడటానికి తాను ఎప్పుడూ ముందుంటానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే గ్యాస్ ధరలను తగ్గించి సరఫరాను సక్రమంగా నిర్వహించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.