సాక్షి డిజిటల్ న్యూస్ 15 మార్చి 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శనివారం పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా 49 ఆవులు, గేదెలకు టీకాలు వేయడం జరిగిందని పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువుల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యుడు మౌలి గౌస్, పశువైద్య సిబ్బంది, పశువుల పెంపకం దారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.