అందోల్ మార్చి 15 సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి జెల్ల భాగయ్య (సౌలు) ఆందోల్ నియోజకవర్గంలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు ఇంతవరకు కష్టపడిన సాధన, నిబంధన మిమ్మల్ని విజయ తీరాల వైపు నడిపించాలని ఆకాంక్షించారు. ఎలాంటి భయాందోళనకు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా సానుకూల దృక్పథంతో పరీక్షలు రాయాలని కోరారు. విద్యార్థులందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని ఆయన అన్నారు. పదవ తరగతి విద్యార్థిని , విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ అని రాయికోడ్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ కచూర్ రావు అన్నారు.