సాక్షి డిజిటల్ న్యూస్ 15 మార్చి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి జగిత్యాల ఎడ్ల అంగడి లోని రామాలయం గ్రౌండ్లో జరగబోయే ఆర్ఎస్ఎస్ సమావేశము మరియు ఉగాది ఉత్సవ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లనన్నిటిని 22 వార్డ్ కౌన్సిలర్ అరవ లక్ష్మి ఏసిఎస్ రాజు లు దగ్గరుండి చేయించడం జరిగింది. గ్రౌండ్ చదును చేయించడం, లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయడము మొదలైన పనులన్నిటిని తమ పర్యవేక్షణలో చేయించారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు బెజ్జంకి సంపూర్ణ చారి చిత్తారి మధుకర్ సోమిరెడ్డి భూమిరెడ్డి రాచ మల్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
