అవినీతి ప్రధానోపాధ్యాయుడికి విద్యాశాఖ అధికారుల ‘కొమ్ముకాపు’

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 15 కర్నూలు జిల్లా కౌతాళం మండలం, కౌతాళం మండల కేంద్రమైన కౌతాళం లో Z P K హైస్కూల్లో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటారా? ఏఐఎస్ఎఫ్ తీవ్ర ఆగ్రహం! కౌతాళం/
అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఒక ప్రధానోపాధ్యాయుడిని కాపాడటానికి విద్యాశాఖ అధికారులు పడుతున్న తాపత్రయం వెనుక ఉన్న రహస్యమేమిటి? అని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్. ఈరేష్ నిలదీశారు.ఈ మేరకు ఆయన ఒక ఘాటైన ప్రకటన విడుదల చేశారు. గత 25 రోజులుగా అవినీతి ఉపాధ్యాయుడి పై చర్యలు తీసుకోవాలని ఉద్యమాలు చేస్తున్నా, సాక్ష్యాధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఉలుకూ పలుకూ లేకపోవడం సిగ్గుచేటు. విద్యాశాఖ అధికారులు విద్యార్థుల పక్షాన ఉన్నారా? లేక అవినీతిపరుల పక్షాన ఉన్నారా? అని ప్రశ్నించారు.అక్షరాస్యతలో వెనుకబడిన కౌతాళం మండలంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సింది పోయి, ఇలాంటి అవినీతి అధికారుల వల్ల విద్య వ్యవస్థ సర్వనాశనం అవుతోంది. అక్రమార్కులను వెనకేసుకొచ్చే అధికారులు ఈ మండలంలో ఉండటం వల్ల ప్రభుత్వ విద్యకు ఒరిగేదేమీ లేదు. పేద విద్యార్థుల నోరు కొట్టి, అక్రమ సంపాదనకు అలవాటు పడిన సదరు ప్రధానోపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారుల తీరు మారకపోతే, ఈ విషయాలన్నీ నేరుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తాం. అవినీతికి సహకరిస్తున్న అధికారుల జాతకాన్ని కూడా బయటపెడతాం.అని హెచ్చరించారు.గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి మేడం గారు తక్షణమే స్పందించాలి. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. ఒకవేళ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే, వేల సంఖ్యలో విద్యార్థులతో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం.అని ఏఐఎస్ఎఫ్ పక్షాన హెచ్చరిక జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శి హనుమేష్,సాయి వర్మ, స్వామి, గోవిందు, భీమయ్య, ఐనూర్,తదితరు నాయకులు పాల్గొన్నారు.