అవంతి ఇంజినీరింగ్ కళాశాల లో అంబరాన్ని తాకిన సంబరం లా “అవెన్సిస్ 2కె26” జాతీయ స్థాయి యువజనోత్సవాలు

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ (భాగం స్వాతి సుధాకర్) మార్చి 15: అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ( అటానమస్ ), తగరపువలస కళాశాలలో “అవెన్సిస్ 2కె26” రెండు రోజులు పాటు జరగనున్న జాతీయ యువజనోత్సవాలు అవంతి ఆద్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని అవంతి తో పాటు అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అవంతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మన రాష్ట్రంలో అవంతి కళాశాలలకు ఒక ప్రత్యేకత ఉంది, ఎటువంటి కార్యక్రమమైనా ముందుగా ప్రవేశపెట్టేది అవంతి విద్యాసంస్థలలోనే, అవంతి విద్యాసంస్థలు ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుందని చెప్పారు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద విద్యార్థులకు కూడా సాంకేతిక విద్యను అందించాలని ఉద్దేశంతో అవంతి విద్యాసంస్థలు ఎప్పుడు ముందుంటాయని రాబోయే రోజుల్లో అవంతి విశ్వవిద్యాలయముగా మార్చబోతున్నామని వివరించారు.మీ తల్లిదండ్రులను ప్రేమించాలి, అలాగే చదువును ప్రేమించాలి, తరువాత చదువుకున్న విద్యాసంస్థను ప్రేమించాలి అలాగే మిమ్మల్ని మీరు ప్రేమించాలని హితవు పలికారు. ప్రస్తుత ప్రపంచంలో సాంకేతికత పరిజ్ఞానం అంతా ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ వైపు అడుగులు వేస్తుందని, మీరు కూడా ఆ రంగాలలో నైపుణ్యాన్ని సాధించాలని హితవు పలికారు. పైతాకళాశాలలో ఇటువంటి యూత్ ఫెస్ట్ లు వలన క్రీడల్లోనూ, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొని మీరు శారీరక ఆరోగ్యముతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పొందుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీధర్ కోసరాజు, ఎమ్.డి., నిమల్ సాఫ్ట్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాట్లాడుతూ మన రాష్ట్రానికి గూగుల్, డేటా సెంటర్లు చాలా వస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్ ఇప్పుడు అన్ని రంగాలలో కిలక పాత్ర పోషిస్తుంది రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చాలా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అవంతి కళాశాల ల మెసేజింగ్ డైరెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ మన రాష్ట్రానికి వస్తున్నాయి మీరు మంచి నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్, సాంకేతికత పరిజ్ఞానములో అనుభవం పొందాలని వివరించారు.ఉషా నగిశెట్టి, ఇండియన్ బాక్సర్ మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత మాట్లాడుతూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి సమాజంలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో కూడా ఉన్నత ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి, దేశానికి, సమాజానికి అలాగే మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొని వస్తారని నా అభిప్రాయం, అలాగే ఇటువంటి కార్యక్రమాలు వలన శారీరక ఆరోగ్యముతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుందని చెప్పారు. ఈ యువజనోత్సవాలు లో భాగంగా విద్యార్థులకు వివిధ క్రీడాంశాలు అయినటువంటి బాస్కెట్ బాల్, కబడ్డీ, వాలీబాల్, కోకో, క్రికెట్, త్రోబాల్, చెస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, స్లో బైక్ రేస్, ట్రెజరీ హంట్, పాటలు పోటీలు, సాంస్కృతిక నృత్యాలు, సోలో నృత్యం, గ్రూప్ డాన్సులు, స్కిట్స్, స్పాట్ ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ మేకింగ్, ఎడ్వర్టైజ్మెంట్ కాంపిటేషన్, ఫేస్ పెయింటింగ్ కాంపిటేషన్, ఫ్యాషన్ షో, రాంప్ వాక్, రాక్ బ్యాండ్, బాడీ బిల్డింగ్, మెమేస్ క్రియేషన్ తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులు నృత్య ప్రదర్శనలు, టాటా ఎక్స్పో మోటార్ బైక్స్ కార్స్ రేసింగ్ యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినీ నేపథ్య గాయని గీతామాధురి యువతను హుసారైన పాటలతో ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముత్తంశెట్టి ప్రియాంక,జనరల్ సెక్రెటరీ, ఐ. శ్రావణ్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్, అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్, డైరెక్టర్ డా. ఎ. చంద్రశేఖర్, ప్రిన్సిపాల్ డా. బి. మురళీకృష్ణ, ఫార్మసీ ప్రిన్సిపాల్ డా. పూర్ణ నాగశ్రీ, డైరెక్టర్ ఎడ్మిన్ ఎస్. విశ్వ ప్రసాద్, డిగ్రీ ప్రిన్సిపాల్ పిన్నింటి రామకృష్ణ, డిప్లామో ఇన్చార్జి ప్రిన్సిపాల్ బి జగదీశ్వర్రావు ప్రోగ్రామ్ కన్వీనర్స్ డా. షరీఫ్,డా. రాము,పిడి చంద్ర శేఖర్,వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్,భోదన,బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.