అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

అక్షర ఆయుధం, మందమరి టౌన్ మార్చ్ 14 : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మందమర్రి ఇల్లందు క్లబ్బులో ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి శివాని రాధాకృష్ణ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.దీనికి ముఖ్య అతిథులుగా జిఎం ఎన్ రాధాకృష్ణ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవకాశాలు కల్పించి ప్రొత్సహించాలే కానీ మహిళలు అన్నిరంగాల్లో మగవారికి ధీటుగా రాణిస్తారు అన్నారు. నేడు మహిళలు వివిధరాంగాల్లో సత్తాచాటుతూ కొన్ని రంగాలను శాసిస్తున్నారు అని తెలిపారు.మాట్లాడుతూ దేశంలోని అత్యున్నత పదవి నుండి నేడు అన్ని రంగాలలో స్త్రీలు సత్తా చాటుతున్నారు అన్నారు. సింగరేణిలోనూ మహిళలు అన్ని విభాగాల్లో అండర్ గ్రౌండ్ విధుల్లో కూడా రాణిస్తున్నారు అని వారికి కావాల్సిన కనీసవసతుల కల్పనతో పాటు పనిప్రదేశాల్లో వారి రక్షణ కోసం తగు చర్యలు తీసుకొని వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్,సీఎం ఓ ఏ ఐ అధ్యక్షులు రమేష్, డీజీఎం పర్సనల్ అశోక్, డి వై ఫైనాన్స్ మేనేజర్ సరిత,శ్రీమతి కవిత లేడీస్ క్లబ్ ట్రెజరర్, లేడీస్ క్లబ్ మెంబర్స్, జిఎం కార్యాలయ సిబ్బంది, సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *