అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సూపర్వైజర్ చిట్టెమ్మ కు ఉత్తమ అవార్డు

సాక్షి డిజిటల్ న్యూస్ డిండి మార్చి 15, నల్గొండ జిల్లా స్రీ మరియు శిశు సంక్షేమ శాఖ డి డబ్ల్యూ ఓ హరిత ఆధ్వర్యంలో శుక్రవారం రోజున నల్గొండ ఉదయ ఆదిత్య భవనం నందు జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో దేవరకొండ మండలం సూపర్వైజర్ డి చిట్టెమ్మ కు ఉత్తమ సూపర్వైజర్ అవార్డుతో పాటు శాలువాతో సత్కరించి జ్ఞాపిక ను అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పున్న శైలజ సిడిపివో చంద్రకళ సూపర్వైజర్స్ విజయలక్ష్మి రేణుక రెడ్డి మేరీ అనిత అంగన్వాడీ టీచర్స్ ఆయాలు తదితరులు పాల్గొన్నారు.