6 గ్యారంటీ లు అమలు చేసే వరకు పోరాడుతామని హెచ్చరించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్

పయనించే సూర్యుడు,మార్చి13 రంగారెడ్డిజిల్లాప్రతినిధి(ఎస్ఎంకుమార్) ఈరోజు గత పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలన లో కేసీఆర్ సారు ప్రభుత్వాలు ఇచ్చేది సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు , అల్లుడు వస్తే ఏడ పండాలే అని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తాం అంటే మేమేం తక్కువ కాదు అని ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని ఇచ్చిన హామీలు మరచి ఓట్ల కోసమే రాజకీయా లు చేస్తూ,ప్రజలను పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిల దీస్తూ తక్షణమే అర్హులై న లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కేటా యించాలని శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యా లయం వద్ద నిర్వహించిన బీజేపీ మహా ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చే సిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజి రెడ్డి బీజేపీ శ్రేణులు,దరఖాస్తుదారులతో కలిసి పాల్గొని ప్రభుత్వానికి చురకలు అంటించిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్ల బి.ఆ ర్.ఎస్ పాలనలో కేసీఆర్ సారు ప్రభు త్వాలు ఇచ్చేది సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు , అల్లుడు వస్తే ఏడ పండాలే అని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారని , అప్పట్లో ఆర్టీఐ ద్వారా కనుక్కుంటే మన దగ్గర నుండి యాభై వేల మంది పైగా అప్లై చేసుకున్నారని, కానీ నియోజక వర్గం లో మొత్తంగా కట్టింది 350 లోపేనని, గుల్మోహర్ పార్క్ వద్ద 244 , హఫీజ్ పేట్ లో 110, కొల్లూరు లో 15,660 కట్టారు వాటిలో కూడా ఇస్తాం అన్నారని తెలుపుతూ, 750000 ఓటర్ల 10 లక్షల జనాభా ఉన్న నియోజవర్గానికి ఇచ్చింది 500 మందికి మాత్రమేనని, అవి కూడా ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కొంతమందికి ఇచ్చారని అందరికి ఇవ్వలేదని తెలియ జేశారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి మరీ దారుణమని,అధికారం లోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఇళ్లు ఇచ్చే ధ్యాసే లేదన్నా రు,ఇల్లు ఇవ్వడం ఏమో గాని హైడ్రా పేరుతో పేదల ఇల్లు మాత్రం కలుస్తున్నారని మండి పడ్డారు,ప్రజా పాలన ప్రగతికి పాలన అంటే పాపం అందరూ నమ్మి ఒక్క శేరిలింగంపల్లి నుండే ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షలలో దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికీ కూడా ఇచ్చిన పాపాన పోలేదని,ఇకనైనా మీరు గ్యారంటీగా అమలుచేస్తా మని 6 హామీ లలో పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కాంగ్రెస్ సర్కారు ఇకనైనా అలసత్వం వీడాలని, లేకుంటే పెద్దఎత్తున ముట్టడి కార్యక్రమాలు చేపట్టాల్సివ స్తుందని హెచ్చరించారు,అసలు కేంద్ర ప్రభుత్వం డబ్బులిస్తున్నా..పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించలేరా,అసలు ఆ నిధులు ఎటు మళ్లిస్తున్నారని ప్రశ్నిం చారు,తెలంగాణ రెవెన్యూ లో సగం శేరిలింగంపల్లి ప్రాంతం నుండే వస్తుందని, అయినా ఇప్పటికీ ఏక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, అభివృధి కోసం అని మా ఎమ్మెల్యే పార్టీలు మారతాడు గాని అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు, ఒక్క కొత్త హాస్పిటల్, స్కూల్ , కాలేజీ కూడా తీసుకురాలేదని,కబ్జాలు,వసూ ళ్లు , అవినీతి పై ఉన్న ధ్యాస ప్రజల పై , ఆరోపణలు ప్రజా సమస్యలపై లేదని, టీఎస్ఐఐసి పేరుతో ప్రభుత్వమే హెచ్సీ యూ భూములను వేలం వేయాలని చూస్తే ఈ ఎమ్మెల్యే ఎక్కడికి పోయిం డని నిలదీశారు, హెచ్ సి యు భూముల పై డిసెంబర్ 11 2024 నెలలో ప్రీ కొల్లట్ర ల్ కింద 400 ఎకరాలు కుదవ పెట్టి 10000 వేల కోట్లు లోన్ కూడా తీసు కంటే ఈ మా ఎమ్మెల్యే ఎంచేస్తున్నారో , ఎంత వాటాలు వచ్చా యో ఆయనకే తెలియాలని ఎద్దేవా చేశారు, అప్పట్లో ప్రభుత్వ భూములు ఎవరో ప్రైవేట్ వాళ్లు కబ్జాలు చేసే వాళ్లు, కొత్త కాంగ్రెస్ పార్టీ ట్రెండ్ ఏంటంటే ప్రభుత్వమే కబ్జాలు చేయడం, హైడ్రా పేరుతో బెదిరించడమ ని, ప్రభు త్వం చెర నుండి విద్యార్థులు, మా బీజేపీ వాళ్ళు కొట్లాడి హెచ్ సి యుభూములపై ధర్నాలు చేసి ,ఫైట్ చేసి కాపాడుకున్నా మని తెలిపారు, మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలన్నారని,మా ర్పు ప్రజలలో వీళ్లకు ఎందుకు ఓటు వేశామా అనే బాధ వచ్చిందని,6 గ్యారెం టీలను గాలికొదిలేసిన మీ కాంగ్రెస్‌ ప్రభు త్వానికి ప్రజలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గుణపా ఠం చెప్పి తీరుతారని,మేము 2 ఏళ్లకు పైగా టైమ్ ఇచ్చి చూసామని,మీ ప్రభు త్వ పనితీరులో ఎలాంటి మార్పు లేదని, ఇక నుండి మీరు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి అమలు చేసే వరకుపోరాడు తూనే ఉంటామని తెలియజే స్తూ, డిప్యూటీ తహసీల్దార్ గకి వినతిపత్రం అందజేసి ప్రభుత్వం నుండి సరైన స్పంద న రాని పక్షంలో పోరాటం ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు,ఈ కార్యక్రమం లో రాష్ట్ర,జిల్లా నియోజ కవర్గ, డివిజన్, వివిధ మోర్చాల నాయ కులు, కార్యకర్తలు, అభిమానులు, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *