పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 14 బోధన్:చాలా మంది ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన , పరిష్కరించడానికి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగపరచుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తేది:28-3-2026 నాడు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇందులో చిన్న చిన్న కేసులు ట్రాఫిక్ చలానాలు మైనర్ క్రిమినల్ కేసులు సివిల్ డిస్ప్యూట్లు వంటి వివాదాలు లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని న్యాయ స్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను తక్కువ సమయంలో ముగించుకోవచ్చన్నారు.అంతేకాకుండా, ఇది ఒక శాంతియుత పరిష్కార విధానం కాబట్టి , పక్షాలు పరస్పర అంగీకారంతో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు.కోర్టు లో గల కేసులలో త్వరగా పరిష్కారం చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.