18న పెద్దపల్లి లో జరుగు సివిల్ సప్లైహమాలి జనరల్ బాడీ మీటింగ్ ను జయప్రదం చేయండి..

★ఏఐటీయూసీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ కడారి సునీల్

సాక్షి డిజిటల్ న్యూస్, 14 మార్చ్ 2026, సుల్తానాబాద్ మండల్ రిపోర్టర్ తిరుకోవళ్లూరి సంజయ్ : పెద్దపెల్లి జిల్లాలో ఈనెల 18న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరుగు సివిల్ సప్లై హమాలి కార్మికుల జనరల్ బాడీ సమావేశం ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ కడారి సునీల్ పిలుపునిచ్చారు. కార్యక్రమం విజయవంతం కొరకై హమాలీ కార్మికుల సమావేశం శుక్రవారం సివిల్ సప్లై పెద్దపల్లి పాయింట్ రాఘవపురంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐటీయూసీ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ కడారి సునీల్ హాజరై మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా లో సివిల్ సప్లై హమాలీ కార్మికులకు లారీ మామూలు గత నాలుగు సంవత్సరాల నుంచి పెంచకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నాడని అన్నారు. పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ సివిల్ సప్లై హమాలి పాయింట్స్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం 18 వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశం కు హమాలిక్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఎస్ బాలరాజు హాజరు కానున్నారని, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ హమాలిక్ కార్మికులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎం కుమార్, కడారి తిరుపతి, బెల్లపు శీను, సతీష్, కందుల శ్రీను, పోషమల్లు, కడారి నరేష్ తదితరులు పాల్గొన్నారు.