పయనించే సూర్యుడు, మార్చి 14 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి; నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ వెల్దండ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వపరిపాలనచి దినోత్సవ వేడుకలను విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు చక్కటి బోధన నిర్వహించారు.ఉపాధ్యాయులుగా నిర్వహించడం ఎంతో గొప్ప పుణ్యమని ఒక విద్యార్థిని సక్రమంగా ఉండాలంటే విద్యార్థిని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుని చేతిలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చిన గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, ఉప సర్పంచ్ శ్రీను ముదిరాజులను, పాఠశాల ఉపాధ్యాయులు స్వాగతం పలికి వారికి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, గ్రామ కార్యదర్శి గిరి గౌడ్, పాలది రంగనాథం, కిష్టల్, మారేపల్లి శ్రీను, ముదికొండ రమేష్, శేఖర్, రాఘవ రెడ్డి, చీముల తిరుపతి రెడ్డి, కొయ్యల పుల్లయ్య, రేవల్లి రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.