సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు.

సాక్షి డిజిటల్ న్యూస్: 14 మార్చి, పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచలోని సుగుణ గార్డెన్‌లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణా తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, తదితరులు నాయకులకు రాజకీయాలపై శిక్షణనిచ్చారు. ఈ తరగతులకు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *