సీఎం సహాయనిధి, కళ్యాణ లక్ష్మిచెక్కులను అందజేసిన డా..ఎమ్మెల్యే సంజయ్ కుమార్

సాక్షిడిజిటల్ న్యూస్, మార్చి 14,రాయికల్ :జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ గుడేటి రెడ్డి సంఘం లో 36 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 14 లక్షల 36 వేల రూపాయల విలువగల చెక్కులను,15 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన 15 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసి,గల్ఫ్ లో మరణించిన రాయికల్ కి చెందిన తోట ధర్మయ్య ,అల్లీపూర్ గ్రామానికి చెందిన దాసరి రమేష్ కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున ప్రొసీడింగ్ పత్రాలు అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్.రాయికల్ పట్టణ ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్ లో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన భవిత సెంటర్ ను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్. పరామర్శ
జగిత్యాల జిల్లా రాయికల్ మండల ఇటిక్యాల గ్రామ మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ తల్లి మరణించగా వారి కుటుంబ సభ్యులను,మంగ్త్య నాయక్ తండా గ్రామ మాజీ సర్పంచ్ బంగారి మరణించగా వారి కుటుంబ సభ్యులనుపరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ కట్కం రవీంధర్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఎంపీడీవో చిరంజీవి, యంపీఓ సుష్మా,మున్సిపల్ వైస్ ఛైర్మన్ సౌజన్య శ్రీధర్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమండ్లు,సీనియర్ నాయకులు రాజి రెడ్డి, ఏ నుగు మల్లారెడ్డి,కోల శ్రీనివాస్,రవీంధర్ రావు, పడిగేల రవీంధర్ రెడ్డి,సురేంధర్ నాయక్,బెజ్జంకి మోహన్, శేఖర్ రెడ్డి,అనుపురం శ్రీనివాస్ గౌడ్,మర్రిపెల్లి శ్రీనివాస్ గౌడ్,యం ఏ ముఖీద్, తిరుపతి గౌడ్, సర్పంచులు, కౌన్సిలర్ లు,నాయకులు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.