సామాజిక వేత్త, బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర కార్యదర్శి ముందస్తు హౌస్ అరెస్ట్

పయనించే సూర్యుడు, మార్చి 13, దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్, వల్లపు నరేష్ నల్గొండ జిల్లా. దేవరకొండ టౌన్ న్యూస్, డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ముందస్తు హౌస్ అరెస్ట్ చేసిన దేవరకొండ పోలీసులు : తేదీ 13/03/2026 శుక్రవారం నాడు ఉదయం 7గంటల 51నిముషాలకు స్థానిక దేవరకొండ స్టేషన్ పోలీస్ లు హనుమాన్ నగర్ లో ఉన్నట్టువంటి సామాజిక వేత్త, బీసీ సంఘము రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ను ముందస్తూగా హౌస్ అరెస్ట్ చేసారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలపై ఇందిర పార్క్ వద్ద దర్నా కార్యక్రమం కి వెళ్ళకూడదు అని ముందస్తు హౌస్ అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతు అరెస్ట్ లతో ఉద్యమన్ని ఆపలేరు అని, తక్షణమే ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేచి చూడకుండా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి న్యాయం చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.