సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని తేనెలొలికే అచ్చమైన తెలుగులో రచించిన ఖ్యాతి మహా కవయిత్రి మొల్లమాంబకే దక్కు ఉందని

★జిల్లా సంయుక్త కలెక్టర్ టి నిశాంతి పేర్కొ న్నారు

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు అమలాపురం శుక్రవారం కవయిత్రి ఆత్కూరి మొల్లమాంబ జయంతిని పురస్క రించుకొని జిల్లా వెనుకబ డిన తరగతుల సంక్షేమ అధికారి వారి ఆధ్వర్యంలో కవయిత్రి ఆత్కూరి మొల్ల మాంబ చిత్రపటానికి పూలమాలలు అలంకరించి పుష్ప గుచ్చాలతో ఘనం గా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగి స్తూ మొట్ట మొదటి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్ల (మొల్ల మాంబ) జయం తిని రాష్ట్ర పండుగగా అధికారికంగా మార్చి 13న ఘనంగా నిర్వహించుకో వడం సంతోషదాయకమ న్నారు.16వ శతాబ్దానికి చెందిన ఈమె కడప జిల్లా గోపవరంలో జన్మించార న్నారు సంస్కృత రామా యణాన్ని సులభమైన తెలుగులో మొల్ల రామా యణంగా రచించిన ఈమె, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి వారని ప్రసిద్ధి అ న్నారు. ఆమె సాహిత్య సేవను గౌరవిస్తూ ఏపీ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా జరుపుతోంద న్నారు. కవయిత్రి ఆత్కూరి మొల్లమాంబ జయంతిని ప్రతి సంవత్సరం మార్చి 13 న రాష్ట్ర పండుగగా జరు పుకుంటారన్నారు రామా యణాన్ని ద్విపద కావ్యం గా, పామరులకు కూడా అర్థమయ్యేలా సులభ శైలిలో ఆమె రచించి పలువురు మన్ననలు చూరగోన్నా రన్నారు. మహిళా సాధికారతకు, భక్తి సాహిత్యానికి ప్రతీకగా ఆమెను కొలుస్తారన్నారు. తొలి తెలుగు రచయిత్రిగా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని మొల్ల మాంబ పదిల పరుచుకున్నారన్నారు. రామాయణాన్ని మహా మహా పండితు లు అనేకమంది రచించిన ప్పటికీ మొల్ల రామాయణా నిది విశిష్ట స్థానమన్నారు. మహా మహా పండితులు సైతం మొల్ల రామాయా ణాన్ని ప్రామాణికంగా ఉదహరిస్తూ ఉంటారన్నా రు బీసీ ఫైనాన్స్ కార్పొ రేషన్ చైర్మన్ రెడ్డి అనంత కుమారి మాట్లా డుతూ మోల్లమాంబ కడప జిల్లా గోపవరంలో నిరుపేద కుమ్మరి వృత్తిదా రుడైన కేశవ శెట్టి ఇంట్లో 14 వ శతాబ్దంలో జీవించినట్టు చారిత్రిక ఆధారాలు ఉన్నా యన్నారు. కవయిత్రి మొల్లమాంబ తెలుగుజాతి గర్వించదగ్గ రచయిత్రి అని కొనియాడారు కవయిత్రి గా మొల్ల మాంబ కీర్తించబ డ్డారన్నారు.సంస్కృతంలోని వాల్మీకి రామాయణాన్ని తెలుగు భాషలోకి అనువ దించారన్నారు. మొల్ల రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రఖ్యాతి గాంచిందన్నారు.
విలువలతో కూడిన కవి త్వాన్ని సమాజానికి అందించడంలో కవయిత్రి మొల్ల ప్రత్యేకత చాటారని కొనియా డారు. రామా యణాన్ని వివిధ భాషల్లో ఎందరో రచించారని, వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని మొల్ల మాంబ తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో తెలుగుభాషలో రచించడం గర్వించదగ్గ విషయమని అన్నారు.మొల్ల రామాయ ణంలో ఆమె సీతాదేవి పాత్రను అత్యంత భక్తితో, సున్నితంగా వర్ణించారన్నా రు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ జి మమ్మీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు శాలివాహన సంఘ ప్రతినిధులు జిల్లాస్థాయి అధికారులు కలెక్టరేట్ పరిపాలన అధికారి కె కాశీ విశ్వేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది భరత్ తదితరు లు పాల్గొన్నారు.