షాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే

సాక్షి డిజిటల్ న్యూస్14/3/2026 రిపోర్టర్ సాయి కిరణ్ షాబాద్ మండలం షాబాద్ మండల కేంద్రంలో చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య పర్యటించారు. ప్రజా ప్రభుత్వం ప్రజా పాలనలో 98 రోజుల ప్రణాళికలో భాగంగా షాబాద్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పేదల వైద్యం కోసం ఎంతో కృషి చేస్తుందని గ్రామీణ ప్రాంతాలలో కూడా మెరుగైన సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మరియు షాబాద్ సర్పంచ్ అశోక్ ఉపసర్పంచ్ రాహుల్ గుడిమల్కా పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ తదితరులు మరియు షాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *