శ్రీ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు

★శ్రీ భారత్ ట్రస్ట్ చైర్మన్ కే. కోటేశ్వరరావు ★ముఖ్యఅతిథిగా స్వామి కమలానంద భారతి

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చ్ 14, కోట మండల రిపోర్టర్ వెంకట కృష్ణయ్య: నెల్లూరు జిల్లా, కోట మండలం విద్యానగర్ లోని షిరిడి సాయిబాబా మందిరంలో 19న శ్రీ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ కె కోటేశ్వరరావు తెలిపారు. కోటలో శుక్రవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థ, యొక్క విలువలు, విశిష్టతల గురించి. సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని భావి తరాలను తీర్చిదిద్దుకొనడానికి మనం ఎంచుకునే మంచి మార్గంలో అభివృద్ధితో విజయం సాధించాలని శ్రీ భారత్ ట్రస్ట్ కోరుకుంటుందన్నారు. సమాజ సేవా సంకల్పంతో సేవా భావం మూల సూత్రంగా చేసుకుని శ్రీభారత్ ట్రస్ట్ ముందుకు నడుస్తుందని కోటేశ్వరరావు వివరించారు.తీయని తెలుగు వెలుగులు ప్రతి కుటుంబంలో వెల్లి విరియాలని పూజ్యశ్రీ శ్రీ శ్రీ శ్రీ కమలా నంద భారతి స్వామిజీ ఆశీస్సులు అందరికీ అందించాలన్న ఆలోచనతోనే ఉగాది ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథి శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామీజీ హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఉగాది విశిష్టత,
స్వామి వారి ప్రసంగం ఉంటుందన్నారు. అనంతరం ప్రభావనామ సంవత్సరాధి ఉగాది క్యాలెండర్ ఆవిష్కరణ ఉదయం 10 గంటలకు షిరిడి సాయిబాబా ఆలయం విద్యానగర్ నందు జరుగుతుందని కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం పలుకుతున్నామని కోటేశ్వరరావు తెలిపారు. అలాగే సాయంత్రం 4 గంటలకు వాకాడు మండలం తూపిలిపాలెం గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ కోటేశ్వరరావు తెలిపారు.పై గ్రామాల్లో జరిగే కార్యక్రమాల్లో శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామీజీ ఆశీస్సులు ప్రసంగాలు ఉంటాయని కోటేశ్వరరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని శ్రీ భారత్ ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నామన్నారు.