శ్రీ అంబా భవాని అమ్మవారిని, కోతుల బావి ఆంజనేయస్వామి దర్శించుకున్న బుట్ట రేణుకమ్మ

*బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రధాన సర్కిల్లో చలివేంద్రం ఏర్పాటు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 14,2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ :పట్టణంలోని గోనెగండ్ల రోడ్‌లో ఉన్న శ్రీ అంబా భవాని దేవాలయాన్ని మాజీ ఎంపీ,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూల్ పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుకమ్మ,బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ భవాని దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని ఉగాది సందర్భంగా కర్నూల్ రోడ్ లో శ్రీశైలంకి వెళ్లే కన్నడి పాదయాత్ర భక్తులకు శ్రీ అంబా భవాని దేవాలయం ఆధ్వర్యంలో, ఏర్పాటు చేసిన ఉచిత భోజన కార్యక్రమంలో, బుట్టా రేణుక బుట్టా శివ నీలకంఠ, భక్తులకు స్వయంగా భోజనాలు వడ్డించి సేవచేశారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక గారు మాట్లాడుతూ, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలంకి పాదయాత్రగా వెళ్లే భక్తులకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భక్తులకు ఉచిత భోజన సదుపాయం కల్పించడం ఒక గొప్ప సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో భక్తి, సేవా భావాలను పెంపొందిస్తా యని తెలిపారు.అలాగే భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ, ప్రతి ఒక్కరూ శాంతి, సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం పట్టణంలోని సంత మార్కెట్ సమీపంలో ఉన్న పురాతన కోతుల బావి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకొని,స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. బుట్టా రేణుకమ్మ మాట్లాడుతూ, ఆంజనేయ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. పురాతన దేవాలయాల పరిరక్షణ మరియు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, మాజీ కౌన్సిలర్ మధుబాబు, గంజిహళ్లి ముల్ల రఫీ,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *